బలుపు పాటల సందడి ఎప్పుడంటే.. !

balupu-గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ, శృతి హాసన్, అంజలి ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం ‘బలుపు’. తమన్ మ్యూజిక్ సమకూరుస్తున్న ఈ చిత్రం ఆడియో వేడుక తేది ఖరారైంది. ఈ ఆడియో వేడుక జూన్ 1న హైదరాబాద్లోని హెచ్ఐసిసి సెంటర్లో జరగనుంది. ముందుగా బలుపు ఆడియోని విజయవాడలో రిలీజ్ చేయాలనుకున్నారు కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ కి సిప్ట్ అయ్యింది. ఇక షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈచిత్రంను జూన్ చివరి వారంలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. చాల కాలంనుండి సరైన హిట్ లేక డీలా పడిన రవితేజ ఈ చిత్రం పై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు.