‘అధికారం వున్నా.. లేకున్నా ప్రజాసేవ చేయాలి’ : లోకేశ్

lokesh-tweet-on-ysrcpతెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఈరోజు (సోమవారం) కరీంనగర్ జిల్లా జగిత్యాలలో కార్యకర్తలతో సమావేశామయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలు అందరికీ ఆదర్శంగా నిలవాలని, అధికారంలో ఉనా, లేకున్నా ప్రజా సేవ చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, సమాజ సేవ అన్నవాళ్ళు… సొంత న్యాయం చూసుకొని చెక్కేశారని.. ఆయన పరోక్షంగా కేంద్రమంత్రి చిరంజీవినుద్ధేశించి వ్యాఖ్యానించారు. ఇక, కలెక్షన్ కింగ్ లను ఆదర్శంగా తీసుకుంటే అనర్థమవుతుందని లోకేష్ అన్నారు. అయితే, టీడీపీకి సొంత పత్రిక, చానల్ లేవని, ఉంటే, తాము కూడా జైల్లో ఉండేవారమని లోకేశ్ వ్యంగ్యోక్తి విసిరారు. తెదేపా అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ, మధ్యం గొలుసు దుకాణాలు రద్దు చేయిస్తామన్న లోకేశ్.. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా ఇంటింటికి మంచినీటి సరఫరా చేస్తామని హామి ఇచ్చారు. గాడితప్పిన రాష్ర్టాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత తెదేపా కార్యకర్తలపైనే ఉందంటూ వారికి కర్తవ్యబోధ చేశారు.