మూడు పాత్రల్లో మ‌హేష్‌..!

maheshసునామీ ఎఫెక్ట్ కాస్త గ‌ట్టిగానే ఉండ‌బోతోంది. ఎందుకంటే ఈ సినిమాలో మ‌హేష్‌బాబు ముచ్చట‌గా మూడు ర‌కాల పాత్రల్లో క‌నిపిస్తార‌ని స‌మాచార‌మ్‌. సుకుమార్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న చిత్రమిది. ఇందులో మ‌హేష్ రాక్‌స్టార్ గా క‌నిపిస్తార‌ని అప్పట్లో చెప్పుకొన్నారు. రాక్ స్టార్ అవునో కాదో చిత్రబృందం బ‌య‌ట పెట్టడం లేదు. కానీ… త‌ప్పకుండా మ‌హేష్ పాత్రలో ఆ ఛాయ‌లు ఉంటాయ‌ని స‌మాచారం. అంతేకాదు.. ఆయ‌న పాత్రలో మ‌రో రెండు యాంగిల్స్ కూడా ఉంటాయ‌ట‌. మ‌హేష్ ఒక్కడే. కానీ మూడు ర‌కాలుగా క‌నిపిస్తుంటాడ‌ట‌. ఇదేదో వెరైటీగానే ఉంది. వెండితెర‌పై ఈ మ్యాజిక్ ఎంత వ‌ర‌కూ న‌చ్చుతుందో చూడాలి.