శ్రీశాంత్ తో.. బాబు పోలికా ?

Chandrababuవైకాపా నేతల చేష్టలు శృతిమించినట్లుగా కనిపిస్తున్నాయి.. మొన్నటివరకు సీనియర్, జూనియర్ ఎన్టీయార్ల ఫోటోలను వైకాపా ఫ్లెక్సీలలో ఉపయోగించుకొని మైండ్ గేమ్ ఆడిన వైకాపా నేతలు… తాజాగా ఎదుటిపార్టీని అప్రతిష్ట పాలు చేయాలని ప్లాన్ వేసింది. గుంటూరు కు చెందిన వైఎస్సార్ సిపి నేత చిన్నపరెడ్డి చంద్రబాబు క్రికెట్ ఆడుతున్న ఫోజులో బొమ్మను పెట్టి మ్యాచ్ ఫిక్సర్ చంద్రబాబుకు శిక్షలేదా అంటూ బొమ్మకింద రాసి ఏర్పాటు చేసారు. ఈ ప్లెక్సీని గమనించిన తెదేపా కార్యకర్తలు ఆ ఫ్లెక్సీని తొలగించి ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో… ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన వైకాపా నేత చిన్నారెడ్దిని పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

రాజకీయంగా ఎన్ని మైండ్ గేమ్ లు ఆడాలనుకున్నా, తమ తెలివితో.. ఎదుటివారి పరువును తీయాలని ఎంత కసి వున్నా..  ఆంధ్రపదేష్ రాష్ర్టాన్ని ప్రపంచ చిత్ర పటంలో నిలబెట్టిన చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ రాజకీయనాయకుడిని ఇలాంటి ఓ మ్యాచ్ ఫిక్సింగ్ ఆటగాడితో పోల్చడమేంటని సాధారణ ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్స్తీలతో, పోస్టర్లతో… వైకాపా నేతల పోలికలు చివరికి ఎక్కడికి దారితీస్తాయో వేచి చూడాలి మరి!