గవర్నర్ తో భేటీయైన తెదేపా తెలంగాణ ఫోరం

tdp-Telangana-forumతెదేపా తెలంగాణ ఫోరం నేతలు ఈరోజు (శుక్రవారం) సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు. బయ్యారం గనులను విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసేలా చొరవ చూపాలని తెదేపా నేతలు గవర్నర్ రు కోరారు. గతంలో రక్షణ స్టీల్స్ కు కేటాయించిన గనులను రద్దు చేసిన తరువాత బయ్యారం గనులను విశాఖ ఉక్కుకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జీవో జారీ అనంతరం తెలంగాణలో భారీ ఎత్తున ఆందోళనలు కూడా మొదలైయ్యాయి. రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో “బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్క” అంటూ ఆందోళనలు కూడా జరిగాయి. తాజాగా తెలంగా ఫోరం నేతలు బయ్యారం గనుల ఉక్కుపై గతంలో జారీ చేసిన జీవోలు రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కలసి వినతిపత్రం అందజేశారు. భేటీ అనంతరం తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. గవర్నర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. రెండు మూడు రోజుల్లో గవర్నర్ చర్యలు తీసుకోకపోతే రాష్ట్రపతి కలుస్తామని వెల్లడించారు.