ఈ టైటిల్ స‌రిపోయిందా?

pawan kalyanప‌వ‌న్ క‌ల్యాణ్ ఇన్ అండ్ యాజ్‌… గ‌బ్బర్ సింగ్‌
ప‌వ‌న్ ఇన్‌…. జ‌ల్సా
ప‌వ‌న్ యాజ్‌… గుడుంబా శంక‌ర్‌!!

ఇలాంటి టైటిళ్లు విన‌డానికి, అలాంటి సినిమాలు చూడ్డానికి అల‌వాటు ప‌డిపోయాం. ప‌వ‌న్ సినిమా అంటే ఆ తర‌హా సౌండింగ్ ఉండాల్సిందే. ప‌వ‌న్ లాంటి మాస్ అప్పీల్ ఎక్కువ‌గా ఉన్న క‌థానాయ‌కుడి నుంచి అలాంటి టైటిళ్లే ఆశిస్తాం.

మ‌రేంటి.. త్రివిక్రమ్ పుసుక్కున `అత్తారింటికి దారేది?` అనేశాడు! ప‌వ‌న్ ఫేసుకీ ఆ టైటిల్‌ కీ ఏమైనా మ్యాచ్ అయ్యిందాండీ?!

పోనీ టైటిల్ మారుస్తారేమో, చివ‌రి నిమిషంలో ఏదైనా స‌ర్‌ ఫ్రైజ్ చేస్తారేమో అనుకొంటే.. స‌మంత ట్విట్టర్ లో కుండ బ‌ద్దలు కొట్టిన‌ట్టు చేప్పేసింది.. ప‌వ‌న్ సినిమా ’అత్తారింటికి దారేది’లో న‌టిస్తున్నానోచ్‌.. అని! టైటిల్ మారిస్తే బాగుండును అనుకొన్న ప‌వ‌న్ ఫ్యాన్స్ ఉసూరుమ‌న్నారు. నిజానికి ఈ టైటిల్ ప‌వ‌న్‌ కి సూట‌వుతుందా? త్రివిక్రమ్ ఎందుకు ఈ ధైర్యం చేస్తున్నాడు?

టైటిల్ చూసి సినిమా చూడ‌మ‌న్నారు సినీ జ‌నాలు. టైటిల్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ సినిమా.. అని కూడా అన్నారు. మ‌రి ఈ టైటిల్ ప‌క్కన ప‌వ‌న్ ఫొటో మ్యాచ్ కాదేమో అనేది ప‌వ‌న్‌ ని పిచ్చ పిచ్చగా అభిమానిస్తున్న‌.. కోట్లాది జ‌న‌సందోహ సందేహం. మ‌రీ క్లాస్ ట‌చ్ ఎక్కవైనాది.. అనుకొంటున్నారు కూడా. తెలుగుద‌నం ఉంది, స్వచ్చంగా ఉంది… కానీ ప‌ల‌క‌బుల్‌ గా లేదు.. అని భ‌యం.

కానీ త్రివిక్రమ్ చేసింది అక్షరాలా నిజం! క‌థ‌కు ఏం కావాలో అదే పెట్టాడు. మాస్ హీరో ఉన్నాడు కదా.. అని క‌థ‌కు సంబంధం లేని మూడ‌క్షరాల ప‌వ‌న్‌ ఫుల్ టైటిల్… ఇరికించేసి అంద‌రి ద‌గ్గరా మార్కులు కొట్టేయొచ్చు. కానీ.. త‌న‌కు కావ‌ల్సింది అది కాదు. క‌థ‌కు ఎలాంటి పేరు స‌రిపోతుందో అదే పెట్టాడు. ద‌టీజ్ త్రివిక్రమ్‌! ఈమ‌ధ్య మూడ‌క్షరాల గొడ‌వ ఎక్కువైపోయింది. ప‌వ‌ర్‌ ఫుల్‌ గా అనిపిస్తే చాలు.. అదే పెట్టేస్తున్నారు. మొన్న తుఫాన్ అన్నారు, ఈ రోజు సునామీ అంటున్నారు. ప్రకృతి వైప‌రిత్యాల పేర్లు త‌ప్ప స‌రైన పేర్లు పెట్టుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాం అన్నమాట‌. ఇలాంటి క‌రవు కాలంలో మ‌న‌దైన పేరు… వినిపించింది అంటే అది త్రివిక్రమ్ చ‌ల‌వే! ఈ విష‌యంలో వ‌వ‌న్‌ నీ అభినందించాలి. హీరోయిజం ఎలివేట్ చేసే టైటిల్ కోసం త్రివిక్రమ్‌పై ఒత్తిడి తేకుండా.. ద‌ర్శకుడు దేన్నయితే న‌మ్మాడో.. అదే పెట్టమ‌న్నాడు. హ్యాట్సాఫ్ టు ప‌వ‌న్‌!! సినిమా హిట్ అవుతుందా? ప‌వ‌న్ సినిమా రికార్డులు తిర‌గ‌రాస్తుందా? అనే విషయాలు ప‌క్కన పెట్టేద్దాం. మంచి టైటిల్ పెట్టినందుకు ఈ చిత్రబృందాన్ని మ‌న‌స్ఫూర్తిగా అభినందిద్దాం.

మరి మీ మాటేంటి? ఈ టైటిల్ ఉంచాల్సిందేనా? లేదంటే ప‌వ‌న్‌ కి నప్పుదు అనుకొంటున్నారా? మీ విలువైన‌ అభిప్రాయాన్ని తెలుగు మిర్చికి తెలియ‌జేయండి.