బోల్డ్ అండ్ గోల్ట్ అనే క్యాప్షన్ తో రూపొందుతున్న చిత్రం… ‘ పవిత్ర. శ్రియ కథానాయిక. జనార్థన మహర్షి దర్శకత్వం వహించారు. శుక్రవారం పవిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకొంది. ఈ చిత్రానికి ఎటువంటి కత్తిరింపులూ లేకుండా ఏ సర్టిఫికెట్ లభించింది. అంతేకాదు… సెన్సార్ సభ్యుల ప్రశంసలు కూడా అందుకొంది. `చాలా కాలం తరవాత ఓ మంచి సినిమా చూశాం. బాధ్యతగల సినిమా ఇది. కొన్ని సన్నివేశాలకు మా కళ్లు చెమర్చాయి…` అంటూ సెన్సార్ సభ్యలు ఉద్వేగంగా చెప్పారట. ఈ కాంప్లిమెంట్స్…. జనార్థన మహర్షికి సరికొత్త ఉత్సాహాన్ని అందించాయి. కొన్ని చేదు గుళికల్లాంటి నిజాలను… వినోదం అనే షుగర్ కోటింగ్ ఇచ్చి… అందించాడు జనార్థన మహర్షి. అందుకు ఆయన ఎంచుకొన్న దారి… పవిత్ర అనే పాత్ర! ఆ పాత్ర చుట్టూ అల్లుకొన్న సన్నివేశాలు సమాజంలో ఉన్న కుళ్లు, కుతంత్రాలను మరో కోణంలో చూపిస్తాయట. జనార్థన మహర్షి స్వతహాగా రచయిత కాబట్టి… ఇందులో ఆలోచనలు రేకెత్తించే సంభాషణలు రాసుకొన్నారట. అవన్నీ… పవిత్ర ప్రధాన ఆస్త్రం. మరి ఈ సినిమా విడుదలయ్యాక చిత్రసీమలో ఎలాంటి చర్చకు తావిస్తుందో, ఎంత మందిని భుజాలు తడుముకొనేలా చేస్తుందో చూడాలి.