సంజయ్ పున: సమీక్ష పిటిషన్ తిరస్కరణ !

sc-sanjay-dutt (1)ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ చివరి ఆశ కూడా ఆవిరైంది. ఇక సంజూ కోర్టులో లొంగిపావాల్సిందే. ముంబయి వరుస పేలుళ్ళ కేసులో తనకు ఐదేళ్ళ జైలుశిక్ష విధించడంపై సంజయ్ దత్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను సుప్రీం ఈరోజు తోసిపుచ్చింది.1993లో ముంబయి వరుస బాంబు పేలుళ్ల కేసులో కోర్టు సంజయ్ కు ఐదేళ్ల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. తాజాగా సంజయ్ రివ్యూ పిటిషన్ ను సుప్రీం తోసిపుచ్చడంలో.. ఆయన ఈనెల ౧౫లోగా కోర్టులో లొంగిపోవడం తప్పనిసరి. కాగా, ఇదే కేసులో మరో ఆరుగురు పెట్టుకున్న రివ్యూ పిటిషన్ లు సైతం సుప్రీం కోర్టు తిరస్కరణకు గురయ్యాయి.