త్రిష రూటు మార్చిందా?

Trishaగ్లామ‌ర్ పాత్రలు, హీరో ప‌క్కన చిందేసే సినిమాలూ రావ‌ని త్రిష డిసైడ్ అయిపోయిందేమో? ఇప్పుడు విజ‌య‌శాంతిలా డిష్యూం డిష్యూం అంటూ ఫైటింగులు చేసే సాహ‌స‌నారి అవ‌తారాలు ఎత్తుతోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌పై దృష్టి పెడుతోంది. ‘ర‌మ్’ అనే సినిమాలో న‌టిస్తోంది త్రిష‌. ఆ సినిమా ప్రస్తుతం సెట్స్‌ పైన ఉంది. ఈలోగా మ‌రో కొత్త లేడీ ఓరియెంటెడ్‌ కి శ్రీ‌కారం చుట్టింది. ఈ సినిమాలోనూ కొన్ని సాహ‌సాలు చేస్తుంద‌ట‌. పూన‌మ్ బాజ్వా మ‌రో క‌థానాయిక‌. ఇలా.. స‌డ‌న్‌ గా మ‌హిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల‌పై దృష్టి పెట్టారేంటి? అని అడిగితే… ”ఇలాంటి పాత్రలు ఎప్పుడో నా ముందుకొచ్చాయి. అయితే.. నా అనుభవం స‌రిపోద‌ని ఇంత కాలం ఆగా. ఇప్పుడు స‌రైన స‌మ‌యం వ‌చ్చింద‌”ని చెబుతోంది.