పవన్ కల్యాణ్ తో తొలిసారి నటించే అవకాశం వస్తే… జేజార్చుకొంది కాజల్. కాల్షీట్లు సర్దుబాటు చేయలేకో, తీరిక లేని సినిమాల వల్లో కాదట..! పారితోషికం నచ్చక ఈ సినిమాని వదులుకొందట. గబ్బర్ సింగ్ 2లో కథానాయిక కాజల్ అయితే బాగుంటుందని ఆ చిత్ర దర్శకుడు సంపత్ నంది భావించాడు. ఈ ప్రపోజల్ కాజల్ దగ్గరకు తీసుకెళ్లాడు. ఆమె కూడా ఓకే చెప్పింది. కానీ పారితోషికం మాత్రం భారీ స్థాయిలో డిమాండ్ చేసిందట. దాంతో కాజల్ ని తప్పించారు. ఈ పాత్ర సమంతకి దక్కిందని సమాచారం. ఒక వేళ సమంత కాల్షీట్లు సర్దుబాటు చేయకపోతే… అమలాపాల్ ని తీసుకొనే అవకాశం ఉంది.