పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహం

ntr statue in parliamentతెలుగుదేశం పార్టే వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు విగ్రహం పార్లమెంట్ ఆవరణలో కొలువుతీరింది. దాదాపు పది, పదిహేనేళ్ల ప్రయత్నం అనంతరం ఈ విగ్రహం ఏర్పాటుకు మార్గం సుగుమం అయింది. ఈరోజు (మంగళవారం) ఉదయం వైభవంగా జరిగిన కార్యక్రమంలో లోక్ సభ స్వీకర్ మీరా కుమార్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 9.3 అడుగుల ఈ విగ్రహాన్ని తన సొంత ఖర్చుతో ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి సమకూర్చారు. ఆవిష్కరణ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు జైరాం రమేష్, గులాంనబీ ఆజాద్, జైపాల్ రెడ్డి, చిరంజీవి, కృపారాణి, సర్వే సత్యనారాయణ, ప్రతిపక్షనేతలు అద్వానీ, అరుణ్ జైట్లీ, మురళీ మనోహర్ జోషి, ములాయం సింగ్ తదితరులు హాజరయ్యారు. జూ. ఎన్టీఆర్ తో సహా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా ఈ వేడుకకు హాజరయ్యారు. ఇంతమందిని ఈ వేడుకకు పిలిచిన స్వీకర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతిని మాత్రం విస్మరించడం గమనార్హం.