లక్ష్మీపార్వతి అరణ్యరోదన !

  lp మంగళవారం నాడు పార్లమెంటు భవనం లో ప్రతిష్టితం కానున్న దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహవేడుకకు ఆయన సతీమణి లక్ష్మిపార్వతికి ఇప్పటివరకు అధికారిక ఆహ్వానం అందలేదు. తనను కేంద్రమంత్రి, రామారావు కుమార్తె పురంధరేశ్వరి కావాలనే అవమానిస్తున్నారని, ఒకవిధంగా రామారావు మృతికి ఆవిడే కారణమని లక్ష్మీపార్వతి సోమవారంనాడు మీడియా సమక్షంలో నిప్పులుచేరిగారు. తనను సాయంత్రంలోగా మర్యాదగా పిలవకపోతే కోర్టు లో కేసు వేస్తానని కూడా ఆమె హెచ్చరించారు. కానీ సాయంత్రం దాకా ఎటువంటి ఫోను రాకపోవటంతో ఆమె స్వయంగా డిల్లీ లోక్ సభ స్పీకర్ కార్యాలయానికి ఫోన్ చేసినట్టు తెలిసింది. అయితే అక్కడనుండి  “మీరు రాదలచుకుంటే రండి ” అనే సమాధానం రావటంతో లక్ష్మీపార్వతి మరింత ఖిన్నురాలైనట్టు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి తాను హాజరు కాకూడదని ఆమె నిర్ణయం గైకొన్నారు. కాగా సోమవారం మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కు లోక్ సభ కార్యాలయం అధికారికంగా ఆహ్వానం రావటంతో ఆయన మంగళవారం ఉదయం డిల్లి బయలుదేరి వెళుతున్నారు. ఆయనతో పాటు తెలుగుదేశం ఎమ్.పి. లు, ఇతర ముఖ్య నాయకులు కూడా ఈ వేడుకలో పాల్గొననున్నారు. ఇదిలా వుండగా ఈ వేడుకలో పాల్గొనకూడదని రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా యు.పి.ఎ. చైర్ పర్సన్ సోనియా గాంధిని వారు కలిసి ఆమెను కూడా ఈ వేడుకకు హాజరు కావద్దని కోరారు.