దాడి వెనుక హరి రాజకీయం?

dadi-sabbam-hariవిశాఖ జిల్లాలో దాడి వీరభద్ర రావు వైకాపా లో చేరడం వెనుక ఎంపి సబ్బం హరి రాజకీయం ఉందని తెలుస్తోంది. హరికి వైకాపాలో కీలక నేతగా ఉన్న కొణతాలకు రాజకీయ విభేదాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో విశాఖలోని ఒక నియోజకవర్గం నుంచి శాసన సభకు పోటి చేయాలన్న ఆలోచనతో హరి ఉన్నారు. కానీ అదృష్టం బాగుంది వైకాపా అధికారంలోకి వస్తే కొణతాలకు ఉన్న ప్రాధాన్యత హరికి ఉండదు. అదీ గాక హరి పోటి చేయాలనుకుంటున్న నియోజకవర్గంలో ఉన్న ఓట్లలో దాడి, కొణతాల సామజిక వర్గానికి చెందినా ఓట్లు బాగా ఉన్నాయి. దాడి కనుక వైకాపాలోకి వస్తే అతని సహకారంతో ఆ ఓట్లు పొందవచ్చు. అదేవిధంగా దాడిని తెస్తే అలిగి కొణతాల బయటకు వెళ్తే జిల్లాలో పార్టీకి సంబదించినంత వరకు తనకు తిరుగు ఉండదు. అదే హరి అచోచనగా కనిపిస్తోంది. జిల్లాలో పార్టీ బలపడుతుందన్న సాకు చాపి హరి ఈ విషయంలో జగన్ ను ఒప్పించినట్లు తెలిస్తోంది. ఇప్పుడు ఈ వ్యవహారంతో ఏమవుతుందో చూడాలి.