సన్ రైజర్స్ ఘనవిజయం !

sunrisers-hydసన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్ డెవిల్స్ పై ఘనవిజయం సాధించింది. హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. సన్ రైజన్స్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ తో ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాటింగ్ లైనప్ ను 80 పరుగులకే కుప్పకూల్చారు. సెహ్వాగ్ (8), కెప్టెన్ జయవర్ధనే (11), ఉన్ముక్త్ చాంద్ (17), వార్నర్ (8) విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో సామీ, స్టెయిన్, పెరీరాలు తలో రెండు వికెట్లు తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. శిఖర్ ధావన్ 16 బంతుల్లో 22 పరుగులు చేశాడు.