రెండుగా చీలిన మంత్రివర్గం!

cm-kiran-bostaరాష్ర్ట్ర మంత్రి వర్గం రెండుగా చీలిపోయినట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అనుకూల, ప్రతికూల వర్గాలుగా చీలిపోయాయి, కత్తులు దూసుకుంటోంది. ముఖ్యమంత్రి ప్రతికూల వర్గానికి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నాయకత్వం వహిస్తున్నట్లు బాహాటంగానే వినిపిస్తోంది. పలు ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెట్టి, ముఖ్యమంత్రి తన స్టయిల్ లో ఎన్నికల దిశగా దూసుకుపోవడంతో ప్రతికూల వర్గాలు ఖంగుతిన్నాయి. ఇలా వదిలేస్తే, ఎన్నికల నాటికి మరింత బలపడి, మళ్లీ ముఖ్యమంత్రిగా ఎక్కడయిపోతారో అని వారికి భయం పట్టుకుంది. అందుకే ఏకపక్ష నిర్ణయాలు అనే సాకుతో కూటమి సభలు, ఢిల్లీకి ఫిర్యాదులు వంటి వ్యవహారాలు చేపట్టారు. నిజానికి ఏకపక్ష నిర్ణయాలు అన్నది కేవలం సాకు మాత్రమే. వైఎస్ హయాంలో కూడా వీరంతా మంత్రులుగా వున్నారు. ఆయన చెప్పిన దానికి తలాడించడం. ప్రకటించిన వాటిని పత్రికల ద్వారా తెలుసుకోవడం తప్ప, కిక్కురుమన్న పాపానికి పోలేదు. అలాంటి వారికి ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది. వాస్తవానికి కిరణ్ కుమార్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, ఇస్తున్న జనాకార్షక హామీలు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో వైలేజీ ఇచ్చేవే కావడం గమనార్హం. మరే కేవలం ఏకపక్షం అన్న సాకుతో అధిష్టానానికి ఏ విధంగా నచ్చచెప్పి, కిరణ్ కుమార్ రెడ్డి మెడలు వంచగలుగుతారో చూడాల్సి వుంది.
ఇదిలా వుంటే మొన్నటికి మొన్న రాహుల్ గాంధీని కలిసి వచ్చినప్పటి నుంచి బొత్స సత్యనారాయణ చాలా వరకు వెనక్కు తగ్గనట్లు కనిపించారు. ముఖ్యమంత్రితో సయోధ్య కుదిరినట్లు కనిపించింది. కానీ అంఅలోనే మళ్లీ అసమ్మతి కార్యక్రమాలు జోరందుకున్నాయంటే, రాహుల్ నేతలకు తలంటనట్టా? తలంటినా, పట్టించుకోనట్టా? అన్న అనుమానం కలుగుతోంది.