Sodaraa : ‘సోదరా’ అంటూ వస్తున్న సంపూర్ణేష్ బాబు


Sodaraa : వినూత్న కథాంశాలు, భిన్నమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరో సంపూర్ణేష్ బాబు, ఈసారి అన్నదమ్ముల అనుబంధాన్ని ప్రధాన ఇతివృత్తంగా ఎంచుకొని ‘సోదరా’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుతో పాటు సంజోష్, ప్రాచీ బంసాల్, ఆరతి గుప్తా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకుంటూ, ఏప్రిల్ 25న విడుదల కాబోతోంది. హైదరాబాద్‌లో గురువారం జరిగిన ట్రైలర్ విడుదల వేడుకకు ముఖ్య అతిథులుగా ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ మరియు ప్రొడ్యూసర్ SKN హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయి రాజేష్ మాట్లాడుతూ – “సంపూర్ణేష్ బాబును చూస్తుంటే గర్వంగా ఉంది. నా దృష్టిలో సంపూ ఎప్పుడూ ఒక స్టార్” అన్నారు. SKN మాట్లాడుతూ – “పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ‘బ్రో’ చిత్రంలా, ‘సోదరా’ కూడా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా” అన్నారు.

సంపూర్ణేష్‌ బాబు మాట్లాడుతూ ”ఈ వేడుక చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన సాయి రాజేష్ ఈ వేడుకకు రావడం హ్యపీగా ఉంది. అప్‌డేట్‌ అయిన తమ్ముడు, అమాయకుడైన అన్న మధ్య జరిగే స్వఛ్చమైన కథ సోదరా. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కంటెంట్‌కు మంచి స్పందన వచ్చింది. ఇది నేను రియల్‌లైఫ్‌లో ఎలా ఉంటానో అలాంటి పాత్ర ఇది. అందరూ ఈ సినిమాను ఆదరించి మా అందరికి మంచి విజయం అందిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.