HHVM : ఫుల్ స్వింగ్ లో హరి హర వీర మల్లు పోస్ట్ ప్రొడక్షన్ పనులు.. ఈసారి పక్కా..!


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మల్టీ లాంగ్వేజ్ చిత్రం హరి హర వీర మల్లు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుంది. ఈ చిత్రం చాలా భాగం క్రిష్ జగర్లమూడి దర్శకత్వం వహించగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను మధ్యలో వదిలేసి వెళ్లడంతో చిత్ర నిర్మాత ఏ.ఏం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ మిగిలిన భాగానికి దర్శకత్వం బాధ్యతలు చేపట్టారు. ఎప్పుడో విడుదల కావాల్సిన చిత్రం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ కావడంతో లేట్ అవుతూ వచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్లు సినిమాపై బాగా హైప్ పెంచాయి. ఇటీవలే ఈ చిత్రాన్ని మే 9, 2025న భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్దమౌతున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. రిలీస్ డేట్ దగ్గర పడుతుండడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేసింది చిత్రయూనిట్. ప్రస్తుతం రీ-రికార్డింగ్, డబ్బింగ్, మరియు విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అద్భుతమైన క్రాఫ్ట్ మెంటలిటీతో చిత్రబృందం ప్రతి ఫ్రేమ్‌ను శ్రద్ధగా మలుస్తోంది.

Also Read :  #NTRNEEL : యంగ్ టైగర్ సెట్స్ లోకి అడుగుపెట్టేది ఆరోజే..!