Puri Connects : పూరి – విజయ్ మూవీలో టబు క్రూషియల్ రోల్ !


డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో ఓ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ గ్రాండ్‌గా ప్రకటించారు. ఉగాది సందర్భంగా అధికారికంగా ప్రకటించిన ఈ చిత్రం కోసం పూరి ఒక పవర్‌ఫుల్ కథను సిద్ధం చేశారు. విజయ్ సేతుపతి ఈ సినిమాలో ఇప్పటివరకు చూడని కొత్త పాత్రలో కనిపించబోతున్నారు. నటనకు గుర్తింపు పొందిన విజయ్, తన డిఫరెంట్ అవతార్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నారు.

Also Read :  Gopichand : 'సాహసం' కాంబో రిపీట్.. గోపీచంద్ కొత్త సినిమా షురూ

ఇక ఈ సినిమాకి మరింత హైప్ క్రియేట్ చేస్తూ టాలెంటెడ్ యాక్ట్రెస్ టబు ఎంట్రీ ఇచ్చారు. సెలెక్టెడ్ రోల్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న టబు, ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. కథ విన్న వెంటనే టబు ఓకే చెప్పినట్టు సమాచారం.పూరి జగన్నాథ్ మాస్ మేకింగ్, విజయ్ సేతుపతి ఇంటెన్సిటీ, టబు గ్రేస్ — ఈ మూడింటి కలయికతో రూపొందనున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలను నెలకొల్పుతోంది.

Also Read :  HIT - The Third Case : HIT 3 రిలీజ్ డేట్ ఫిక్స్ !