దాసరి మాట్లాడరేం?

dasari

తను స్పందించాల్సిన అంశం వుంటే, వదిలి పెట్టని దర్శకుడు దాసరి నారాయణ రావు సినిమా టిక్కెట్ల పెంపుపై ఇంతవరకు పెదవి విప్పలేదు. సాధారణంగా చిన్న నిర్మాతలు, చిన్న సినిమాలకు దన్నుగా నిలిచే దర్శకుడు దాసరి, టిక్కెట్ల ధరల పెంపు వ్యవహారం వాటికి హాని చేస్తుందని తెలసీ, ఎందుకు ఊరుకున్నట్లో? టికెట్ ధరల పెంపు ఇటు మెగా క్యాంప్, అటు నాగ్, ఎన్టీఆర్ తదితరులు నటించే భారీ సినిమాలకు మాత్రమే పనికి వస్తుందని తెలుసు. అందుకే వారంతా, చిరంజీవి ద్వారా ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి జీవో విడుదల చేయించుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. భారీ సినిమాలు హిట్ కొడితే చాలు నలభై కోట్ల వసూలు సులువు అయిపోతుంది. ఇప్పుడు పది నుంచి ఇరవై శాతం టిక్కెట్ ధరలు పెరిగితే ఆ సినిమాలు యాభై కోట్ల రేంజ్ కు చేరుకుంటాయి. కానీ చిన్న సినిమాలు మాత్రం కుదేలవుతాయి. ఇది తెలసీ దాసరి ఎందుకు మౌనంగా వునట్లో. తన మాట ఎలాగూ చెల్లుబాటు కాదనా?

//