KA Paul : తిరుమల తిరుపతిని యూనియన్ టెరిటరీగా ప్రకటించాలి


కేఏ పాల్ తిరుమల తిరుపతి వివాదంపై దాఖలు చేసిన పిటిషన్ అత్యవసరంగా విచారించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఆయన పేర్కొన్నట్లు, కోట్లాది భక్తుల మనోభావాలతో ఆడుకోవడం సరైనది కాదని, ఆ సంఘటనలను కఠినంగా పరిగణించాలన్నారు. తన పిటిషన్‌లో తిరుమల తిరుపతిని యూనియన్ టెరిటరీ (UT)గా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.

తిరుమల ప్రసాదం లడ్డూ వివాదం విషయంలో చంద్రబాబు నాయుడు అనవసర డ్రామాలు సృష్టించారని విమర్శించారు. ఇలాంటి అనవసర అంశాల్లో చంద్రబాబు వివాదాలు సృష్టించడం తగదని పేర్కొన్నారు. అంతేకాక, చంద్రబాబును ఎన్డీయే (NDA) నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ, ఆయన ప్రధాని మోడీని టెర్రరిస్ట్ అని సంబోధించడం సరికాదని అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, ఆయన డ్రామాలు మానుకుని, తక్షణమే క్షమాపణలు చెప్పాలని సూచించారు. అంతేకాక, పవన్ కళ్యాణ్ చంద్రబాబు మారు మనసు పొందేలా ఒక దీక్ష చేపట్టాలని కోరారు.