తెలుగుసీమలో వేశ్యల హవా నడుస్తోంది. ఛార్మి, శ్రియ, వేద.. ఇప్పటికే ఈ పాత్రల్లోకి దిగిపోయారు. ఇప్పుడు ఈ జాబితాలో మరో కథానాయిక చేరింది. ఆమే హరిప్రియ. అందరి బంధువయా సినిమాతో పద్ధతిగా కనిపించిన ఈ భామ ఇప్పుడు హాట్ బాట పట్టింది. ఏకంగా వేశ్య పాత్రలో కనిపించనుంది. వరుణ్ సందేశ్-హరిప్రియ జంటగా నటించిన చిత్రం అబ్బాయి క్లాస్, అమ్మాయి మాస్. ఈ సినిమాలో హరిప్రియ వేశ్యగా కనిపించనుంది. ”కథానాయకుడి జీవితంలోకి వేశ్య ఎలా ప్రవేశించింది? ఎందుకు? అనేది కీలకం. ఆ పాత్రలో హరిప్రియ నటన తప్పకుండా ఆకట్టుకొంటుంది. ప్రస్తుతం డీటీఎస్ మిక్సింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తాం” అని ఈ చిత్ర దర్శకుడు కోనేటి శ్రీను చెబుతున్నారు. ఛార్మి, శ్రియలకు ఈ అమ్మాయి ఎలాంటి పోటీ ఇస్తుందో???