అదరగొడుతున్న రా మచ్చా.. ఫుల్ సాంగ్


గేమ్ ఛేంజర్’ చిత్రం నుండి తాజాగా విడుదలైన రెండో పాట “రా మచ్చా.. మచ్చా” సాంగ్ ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తిని కలిగిస్తోంది. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ అద్భుతమైన సాహిత్యం అందించగా, నకాష్ అజీజ్ తన మధురమైన గాత్రంతో పాటను ఆలపించారు. తమన్ సంగీతం మరోసారి పాటకు ప్రాణం పోసింది. పాటలో రామ్ చరణ్ ఎంతో శ్రద్ధగా వేసిన స్టెప్పులు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట చిత్రీకరణకు సంబంధించిన ఆసక్తికర అంశాలు కూడా ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ఈ పాటను దాదాపు 1000కి పైగా జానపద కళాకారులు, రామ్ చరణ్‌తో కలిసి ఈ పాటలో నృత్యం చేసినట్లు దర్శకుడు శంకర్, సంగీత దర్శకుడు తమన్ వెల్లడించారు. ఆ కళాకారులు ఆంధ్రప్రదేశ్, ఒడిషా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుండి ప్రత్యేకంగా ఈ పాట కోసం వచ్చారని తెలిపారు. ఈ చిత్రంలో కియారా అడ్వాణి హీరోయిన్‌ గా నాటిస్తుండగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు. అంజలి, ఎస్‍జే సూర్య, శ్రీకాంత్, జయరాం, సునీల్, సముద్రఖని కీల‌క పాత్ర‌లను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్ సందర్బంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.