సామాన్యులకు మరో షాక్.. పెరగనున్న బియ్యం ధరలు


సామాన్యులపై మరో దెబ్బ తగలనుంది. ఇప్పటికే నిత్యావసరాలు, వంట నూనె, పప్పుల ధరలు పెరగడంతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతుండగా, బియ్యం ధరలు మరింత షాక్ ఇవ్వనున్నాయి. ప్రస్తుతం సోనామసూరి, HMT, BPT వంటి సన్నబియ్యం రకాల ధరలు కిలోకు రూ.60-70 మధ్య ఉన్నాయి.

బాస్మతీ కాకుండా ఇతర బియ్యం ఎగుమతులపై నిషేధం తొలగించడం, పారా బాయిల్డ్, బ్రౌన్ రైస్ పై ఎగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించడం వంటి చర్యలు బియ్యం ధరల పెరుగుదలకు దారి తీస్తున్నాయి.
ఇప్పటికే వంట నూనెల ధరలు భారీగా పెరిగి, కిలోకు రూ.10 నుంచి 20 వరకు పెరుగడంతో సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ ధరల పెరుగుదల సాధారణ ప్రజల జీవితాలను మరింత సంకుచితం చేసేది కావడంతో, ప్రజలు ప్రభుత్వం నుండి మరింత సహాయాన్ని ఆశిస్తున్నారు.