చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు, ఐశ్వర్య రాజేష్ సలహా …


జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ తాజాగా వైరల్‌గా మారిన నేపథ్యంలో, చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై నటి ఐశ్వర్య రాజేశ్ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. తాజాగా ఓ ఇంగ్లిష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, “నటీమణులు ధైర్యంగా ఉండాలి” అని ఆమె సూచించారు. నేను చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. కాలానుగుణంగా అనేక మార్పులు జరిగాయి,” అని చెప్పుకొచ్చారు. ఆమె మాట్లాడుతూ, “నేను ఇప్పటివరకు ఎలాంటి వేధింపులకు లోనుకాలేదన్నారు, కానీ వేధింపులకు పాల్పడే దోషులకు కఠిన శిక్షలు విధించాలని కోరుకుంటున్నాను,” అన్నారు. “మహిళలు ధైర్యంగా ఉండాలి. మీరు ఇబ్బంది పడితే వెంటనే స్పందించండి. మీ అభిప్రాయాలను గట్టిగా వినిపించాలి,” అని ఆమె స్పష్టంగా చెప్పారు. కాగా, ఆమె మాట్లాడుతూ, “ఔట్‌డోర్ షూట్‌ల సమయంలో సరైన వసతులు లేకుండా మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. టాయిలెట్లు కూడా సరిగా ఉండడం లేదు” అని వెల్లడించారు.