యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన “దేవర పార్ట్ 1” సినిమా, కొరటాల శివ దర్శకత్వంలో సెప్టెంబర్ 27న ఘనంగా విడుదలై బాక్సాఫీస్‌ను శాసిస్తుంది. ఎన్టీఆర్ మాస్ పవర్‌కు అభిమానులు ఫిదా అవుతూ, వసూళ్ల సునామి సృష్టించడంతో సినిమా పలు రికార్డులను తిరగరాస్తోంది. ఫస్ట్ డే అంచనాలను మించి, “దేవర” 172 కోట్ల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. రెండో రోజు వీకెండ్ కావడం వల్ల, వసూళ్లు మరింత పెరిగే అవకాశముంది. అంచనాల ప్రకారం, రెండో రోజునే 150 కోట్ల కలెక్షన్లు సాధించి, రెండు రోజుల్లోనే “దేవర” 300 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే, మూడో రోజుకు 500 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దసరా సెలవులు కూడా పుష్కలంగా ఉండటంతో, “దేవర” వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది జరిగితే, ప్రభాస్ తర్వాత రెండు వెయ్యి కోట్ల సినిమాలు అందుకున్న హీరోగా ఎన్టీఆర్ చరిత్ర సృష్టిస్తాడు. అలాగే, రాజమౌళి తర్వాత వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన తెలుగు దర్శకుడిగా కొరటాల శివ ప్రత్యేక గుర్తింపు పొందుతాడు. “దేవర” టాక్ ఎలా ఉన్నా, వసూళ్ల పరంగా ఊహించని విజయాన్ని సాధించి, లాంగ్ రన్‌లో పలు రికార్డులను బద్దలుకొడుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.