SWAG Teaser : కింగ్ అఫ్ కంటెంట్ శ్రీవిష్ణు వైవిధ్యమైన పాత్రలతో అదరగొడుతున్నారు. ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకునే సబ్జెక్ట్‌లను బ్యాలెన్స్ చేయడంలో పేరుపొందిన శ్రీ విష్ణు సూపర్ హిట్ ‘రాజ రాజ చోర’ తర్వాత డైరెక్టర్ హసిత్ గోలీతో తన సెకెండ్ కొలాబరేషన్ గా ‘శ్వాగ్’ తో అలరించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిబొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.
టీజర్ విషయానికొస్తే.. శతాబ్దాల క్రితం పురుషుల ఉనికికే ముప్పు పొంచి ఉన్న కాలంలో, వింజమర వంశానికి చెందిన రాణి రుక్మిణీ దేవి పురుషులపై తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకుంది, తనకు ఒక కొడుకు పుడితే చంపడానికి కూడా వెనుకాడదు. అయితే రాజవంశంపై ఒక శాపం చివరికి పరిస్థితిని రివర్స్ చేస్తుంది. ఇది క్రమంగా మార్పుకు దారితీస్తుంది. అక్కడ పురుషులు స్త్రీలపై ఆధిపత్యం చెలాయించడం ప్రారంభిస్తారు. మొత్తానికి టీజర్ చాలా వినోదాత్మకంగా సాగింది. ఇక శ్రీ విష్ణు.. కింగ్, భవభూతి, సింగ, యయాతి వంటి విభిన్నమైన పాత్రలలో అద్భుతంగా అలరించారు. క్వీన్ రుక్మిణీ దేవిగా రీతూ వర్మ మెప్పించింది. వేదరామన్ శంకరన్ కెమెరా పనితనం ఇంపాక్ట్ పుల్ గా ఉంది, వివేక్ సాగర్ ఆకట్టుకునే స్కోర్‌తో ప్రతి ఎలిమెంట్‌ను ఎలివేట్ చేశాడు.
Also Read : సూపర్ స్టార్ సినిమాలో కింగ్ నాగార్జున.. లుక్ అదుర్స్
టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. “మగ మహారాజులకు, మకుటం లేని మహారాణులకు శ్వాగనిక వంశానికి స్వాగతం. టీజర్ మీ అందరికీ నచ్చినందుకు చాలా ఆనందంగా వుంది. ఇలాంటి కథ నాకు ఇచ్చిన హసిత్ కు చాలా థాంక్స్. ఇది చాలా గొప్ప కథ. ఇండియన్ స్క్రీన్ లో ఇప్పటివరకూ రాలేదు. ఇది మన అందరి ఇళ్ళలో వున్న పాయింట్ అయినా స్క్రీన్ పైకి ఇప్పటివరకూ రాలేదు. ఇలాంటి కంటెంట్ ని సినిమా చేయడానికి ముందుకువచ్చిన నిర్మాత విశ్వప్రసాద్ గారికి థాంక్ యూ. ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా దమ్ముండాలి. టీంలో అందరికీ థాంక్ యూ. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం” అన్నారు.