నగల దుకాణాల మీద తరచూ ఎదో ఒక వివాదం చూస్తూనేవుంటాం,తరుగు దగ్గరనుంచి తూనికలు కొలతల్లో మోసాలవరకు నిత్యం వివాదాల్లోవాటి పేరు వినపడుతూనే ఉంటుంది. డబ్బులు ఎవరికీ ఊరికే రావు అనే టాగ్ లైన్ తో హడావుడి చేసే లలితా జువెలర్స్ కూడా దీనికి మినహాయింపు కాదు..లలితా జువెలర్స్ కిరణ్ చేసే హడావుడి చుస్తే నిజంగానే ఈయన తక్కువరేటుకు ఇస్తున్నాడేమో అనిపిస్తుంది .. కానీ నిజాలు వేరు ,లలితా జువెలర్స్ మీద అనేకసార్లు తూనికలు కొలతలు శాఖ దాడులు నిర్వహించి జరిమానా విధించిన సందర్భాలు కోకొల్లలు,ఇలాంటి లలితా జువెలర్స్ ఇటీవల సుచిత్రాలో ఒక కొత్త షాప్ ఓపెనింగ్ చేసింది దీనికి తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిధి గా వెళ్లి షాప్ ఓపెన్ చేసి వచ్చారు..అసలే లలితా జువెలర్స్ దివాళాకు దగ్గరగా వుంది అని చాలారోజుల నుంచి వ్యాపార వర్గాల్లో ప్రచారం జరుగుతుంది మరి ఇలాంటి పరిస్థితి లో శ్రీధర్ బాబు మంత్రి గా ఉండి ఆ షాప్ ఓపెనింగ్ కి ఎందుకు వెళ్లారో అనే వాదన వినిపిస్తుంది . లలితా జువెలర్స్ లు అసలు ఎం జరుగుతోందో తెలియక వెళ్ళారా లేక మరెవరైనా ఆయనకు ఇవేమి తెలియకుండా మేనేజ్ చేసి అక్కడకు రప్పించారా అనే వాదన వినిపిస్తుంది.. రేపు లలితా జువెలర్స్ బ్యాంకరప్ట్ అయితే శ్రీధర్ బాబు మీద కూడా విమర్శలు రావడం కామన్ ,మరి ఇకనైనా శ్రీధర్ బాబు ఇలాంటివాళ్ల పట్ల జాగ్రత్త వహిస్తారో లేదో చూడాలి.