Filmfare Awards : ఐదు అవార్డ్స్ తో సత్తా చాటిన కల్ట్ బ్లాక్ బస్టర్ ‘బేబి’


Filmfare Awards South 2024 : ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మాణంలో దర్శకుడు సాయి రాజేశ్ రూపొందించిన కల్ట్ బ్లాక్ బస్టర్ ‘బేబి’ మరో హిస్టారిక్ ఫీట్ చేసింది. తాజాగా నిన్న(ఆగష్టు 4) హైదరాబాద్ లో జరిగిన శోభ ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డ్స్ లో బేబి సినిమాకు 5 అవార్డ్స్ దక్కాయి. 8 నామినేషన్స్ లో 5 అవార్డ్స్ గెల్చుకుంది బేబి.

Also Read : Bigg Boss Telugu 8 : వరాలు ఇచ్చే కింగ్.. ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు !

బేబి సినిమాలో ది బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చిన వైష్ణవి చైతన్య బెస్ట్ యాక్ట్రెస్(క్రిటిక్స్) గా, క్లాసిక్ ఇమేజ్ తో పాటు కమర్షియల్ సక్సెస్ సాధించి 100 కోట్ల గ్రాసర్ గా నిలిచినందుకు బెస్ట్ ఫిల్మ్(క్రిటిక్స్) గా, తన మ్యూజిక్ తో బేబికి ప్రాణం పోసిన విజయ్ బుల్గానిన్ బెస్ట్ మ్యూజిక్ కంపోజర్ గా, ఓ రెండు మేఘాలిలా పాటతో టైటిల్స్ నుంచే సినిమాలో ప్రేక్షకుల్ని లీనం చేసేలా సాహిత్యాన్ని అందించిన అనంత్ శ్రీరామ్ కు బెస్ట్ లిరిసిస్ట్ గా, ఈ పాట అందంగా పాడిన శ్రీరామ చంద్ర బెస్ట్ సింగర్ గా అవార్డ్స్ దక్కాయి.

Also Read : వయనాడ్ బాధితులకు రష్మిక మందన్న భారీ విరాళం

బేబి సినిమాకు ప్రేక్షకుల రివార్డ్స్ తో పాటు ప్రతిష్టాత్మక అవార్డ్స్ దక్కుతున్నాయంటే ఆ ఘనత ఈ ప్రేమ కథను హృద్యంగా తెరపై ఆవిష్కరించిన డైరెక్టర్ సాయి రాజేష్ కే దక్కుతుంది. ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్, డైరెక్టర్ సాయి రాజేష్ కాంబినేషన్ లో బాలీవుడ్ లో బేబి సినిమా రీమేక్ కు శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి.

69 శోభ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 తెలుగు విజేతలు:

* ఉత్తమ చిత్రం: బలగం
* ఉత్తమ నటుడు: నాని (దసరా)
* ఉత్తమ నటి: కీర్తి సురేష్ (దసరా)
* ఉత్తమ దర్శకుడు వేణు యెల్దండి (బలగం)
* ఉత్తమ పరిచయ దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యువ్ (హాయ్ నాన్న)
* ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): సాయి రాజేష్ (బేబీ)
* ఉత్తమ నటి (క్రిటిక్స్): వైష్ణవి చైతన్య (బేబీ)
* ఉత్తమ నటుడు (క్రిటిక్స్): నవీన్ పొలిశెట్టి (మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి), ప్రకాశ్ రాజ్ (రంగమార్తాండ)
* ఉత్తమ సహాయ నటుడు: రవితేజ (వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ)
* ఉత్తమ సహాయ నటి: రూప లక్ష్మీ (బలగం)
* ఉత్తమ గాయకుడు: శ్రీరామచంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. బేబీ)
* ఉత్తమ గాయని: శ్వేత మోహన్ (మాస్టారు.. మాస్టారు.. సార్)
* ఉత్తమ గేయ సాహిత్యం: అనంత్ శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. బేబీ)
* ఉత్తమ సంగీతం: విజయ్ బుల్గానిన్ (బేబీ)
* ఉత్తమ సినిమాటోగ్రఫీ: సత్యన్ సూరన్ (దసరా)
* ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: కొల్లా అవినాష్ (దసరా)
* ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్ (ధూమ్ ధామ్ దోస్తానా.. దసరా)