నాగ్ ఆశ‌లు పెంచుకొంటున్నాడు!

greeku-veeruduగ్రీకువీరుడు విడుద‌ల‌కు సిద్ధమైంది. ఈ సినిమాపై అటు నాగ్ అభిమానుల్లోనూ, ఇటు చిత్రపరిశ్రమ‌లోనూ పెద్దగా అంచ‌నాల్లేవు. నాగ్ పెట‌ప్ కాస్త ఆక‌ర్షిస్తున్నా- ద‌ర్శకుడు ద‌శ‌ర‌థ్ కాబ‌ట్టి… జ‌నాలు జంకుతున్నారు. ఎందుకంటే స్లో నేరేష‌న్‌ తో ఆయ‌న విసుగెత్తిస్తార‌ని భ‌యం. ఈ సినిమా టాక్ కూడా అంత గొప్పగా లేదు. అయితే నాగార్జున‌కు మాత్రం ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ సినిమా ప్రమోష‌న్ విష‌యంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. విడుద‌ల తేదీ ద‌గ్గర ప‌డుతున్న కొద్దీ… ఆయ‌న‌కి ఈ సినిమాపై న‌మ్మకాలు పెరిగిపోతున్నాయి. న‌య‌న‌తార కోస‌మైనా జ‌నాలు థియేట‌ర్ల‌ కు వ‌స్తార‌ని ఆయ‌న ఆశ‌. అంతేకాదు.. గ్రీకువీరుడు సినిమాతోనే పెరిగిన టికెట్లు రేట్లు అమ‌ల్లోకి రానున్నాయి. అది కూడా ఈ సినిమాపై ప్రభావం చూపించ‌నుంది. సినిమా బాగుంటే క‌చ్చితంగా భారీ వ‌సూళ్లు మూట‌గ‌ట్టుకోవ‌చ్చు. ”బ‌య‌ట దేశాల్లో సినిమా కెళ్తే… త‌డిసి మోపెడ‌వుతుంది. విదేశాల‌తో పోలిస్తే… ఇక్కడే చ‌వ‌క‌. నా సినిమాతో టికెట్టు రేట్లు పెర‌గ‌డం ఆనందాన్నిస్తోంది..” అని నాగ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.