TGSRTC : ఆర్టీసీ ఉద్యోగార్థులకు ముఖ్య గమనిక.. అవన్నీ ఫేక్ లింక్స్..


తెలంగాణ రాష్ట్ర రోడ్డు రావాణసంస్థ(TGSRTC)లో 3035 పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైందని, ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలంటూ కొన్ని లింక్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా మూవీ.. క్యూరియాసిటీ పెంచుతున్న టైటిల్..

ఈ క్రమంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఉద్యోగార్థులకు ముఖ్య గమనిక అంటూ ఎక్స్ లో ఒక ట్వీట్ చేసారు. “రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకు సంస్థలో 3035 కొలువుల భర్తీకి సంబంధించిన కసరత్తును TGSRTC ప్రారంభించింది. 3035 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైందని, ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలంటూ కొన్ని లింక్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉద్యోగార్థుల అర్హతలు, దరఖాస్తు ఫీజు, తదితర వివరాలను అందులో పేర్కొన్నారు. అవన్నీ ఫేక్. ఆ లింక్ లను ఉద్యోగార్థులు నమ్మొద్దు. క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలను నమోదు చెయొద్దని TGSRTC యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది” అని పోస్ట్ చేసారు.