Swapna Varma : టాలీవుడ్ లో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న మహిళా నిర్మాత


టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ స్వప్న వర్మ (33) ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌ కావూరి హిల్స్‌లో తాను ఉంటున్న ఫ్లాట్‌లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. స్వప్న సొంతూరు రాజమండ్రి. మూడేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి.. కావూరి హిల్స్‌లోని తీగల హౌస్ 101లో స్వప్న ఒంటరిగా ఉంటున్నారు. అయితే గత ఆరు నెలలుగా ఎలాంటి ప్రాజెక్టులు లేవు. ఈ క్రమంలోనే మానసికంగా ఒత్తిడికి గురైన ఆమె.. రెండు రోజుల క్రితం తన ఫ్లాట్‌లో ఫ్యానుకు ఉరివేసుకుంది. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటికి చేరుకుని తలుపులు తెరిచి చూడగా స్వప్న ఉరివేసుకుని చనిపోయి కనిపించింది. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందుల‌తోనే ఆమె ఈ ప‌ని చేసి ఉంటుంద‌ని పోలీసులు భావిస్తున్నారు.

Also Read : ఏడాదికి రెండు సార్లు టెట్ పరీక్ష.. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ