Kalki 2898 AD : గ్రేటెస్ట్ లెజెండ్స్ తో వర్క్ చేయడం.. ఇట్స్ బిగ్గర్ దెన్ డ్రీం : ప్రభాస్


విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ విజువల్ వండర్ లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో గ్లోబల్ వైడ్ గా హ్యూజ్ బజ్ ను క్రియేట్ చేసిన ఈ చిత్రం జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ముంబై లో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో కల్కి టీంతో హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ఇంటరాక్షన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

Kalki 2898 AD : ‘కల్కి 2898 AD’ లో భాగం అవ్వడం గ్రేట్ హానర్ : అమితాబ్ బచ్చన్

ప్రీరిలీజ్ ఈవెంట్ లో రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ.. గ్రేటెస్ట్ లెజెండ్స్ తో వర్క్ చేసే అవకాశం ఇచ్చిన దత్తు గారు, నాగీ గారికి థాంక్ యూ. ఇట్స్ బిగ్గర్ దెన్ డ్రీం. అమితాబ్ గారు కంట్రీ మొత్తం రీచ్ అయిన ఫస్ట్ యాక్టర్. కమల్ సార్ సాగరసంగమం చూసి కమల్ హాసన్ గారి లాంటి డ్రెస్ కావాలని మా అమ్మని అడిగాను. అలాగే ఇంద్రుడు చంద్రుడు చూసి కడుపులో క్లాత్ చుట్టుకొని ఆయనలానే యాక్ట్ చేసేవాడిని. అలాంటి లెజెండ్స్ తో యాక్ట్ చేయడం అన్ బిలివబుల్. అలాగే దీపిక ఇంటర్నేషనల్ లెవల్ కి రీచ్ అయిన స్టార్. దీపికతో నటించడం బ్యూటీఫుల్ ఎక్స్ పీరియన్స్. అందరికీ థాంక్ యూ అన్నారు.

Sundeep Kishan : ‘ధమాకా’ డైరెక్టర్ తో సందీప్ కిషన్ మూవీ..