పవన్ కల్యాణ్ అనే నేను..

‘‘కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను’’ అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కేసరపల్లి సభావేదికపై పవన్ తో ప్రమాణం చేయించారు.
కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను.. అంటూ పవన్ పలకగానే ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తల సంతోషం మిన్నంటింది. చప్పట్లు, కేకలతో సభా ప్రాంగణం మార్మోగింది. పవన్ ప్రమాణస్వీకారం చేస్తుండగా ఆయన భార్య అన్నా లెజనోవా, సోదరుడు చిరంజీవి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. ప్రమాణం పూర్తయ్యాక వేదికపై ఉన్న చంద్రబాబు దగ్గరికి వెళ్లిన పవన్ కల్యాణ్ ఆయనతో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా పవన్ ను చంద్రబాబు అభినందించారు. ఆపై వేదికపై ఉన్న గవర్నర్, ఇతర ప్రముఖులకు ఆంధ్రప్రదేశ్ మంత్రి పవన్ కల్యాణ్ నమస్కరించారు. అన్న చిరంజీవికి పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.

Also Read :  AA22 Announcement : బన్నీ నెక్స్ట్ - పుష్ప కి మించి..!