బిగ్ బాస్ శివాజీకి కూతురు ఉందా..? అసలు నిజం ఇదే ..


బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు షో బాగా జనాలకు ఎక్కేసింది.. ఈ సీజన్ బాగా ఫేమస్ అయ్యింది.. మొత్తం సీరియల్ , సినిమా బ్యాచ్ లతో ప్రేక్షకులను అలరించారు.. ఈ సీజన్ లో హీరో శివాజీ కూడా పాల్గొన్నాడు.. ఇంటిపెద్దగా ఉంటూ అందరికి మంచి చెడులు చెప్తూ వచ్చాడు.. ఈ షోలో ఒక టాస్క్ లో భాగంగా శోభా పై విపరీతమైన కోపంతో రగిలిపోయిన నాకు ఇలాంటి కూతురు ఉంటే గొంతుమీద కాలువేసి తొక్కేవాడిని అంటాడు.. అది అప్పట్లో ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ..

అయితే శివాజీకి కూతురు ఉందా అనే అనుమానాలు అందరికి రావడం మొదలయ్యాయి.. అలాంటి టైంలో నటుడు సమీర్.. శివాజీకి కూతురు ఉందంటూ బాంబ్ పేల్చాడు. అప్పటివరకూ తనకి ఇద్దరు కొడుకులు మాత్రమే అని చెప్పిన శివాజీ..కూతురు విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచాడు .. అనే గుసగుసలు జనాల్లో మొదలయ్యాయి.. ఇటీవల ఆలీ షోకు వెళ్లిన శివాజీ తనకు కూతురు ఉండనే విషయం పై క్లారిటీ ఇచ్చాడు..

ఆ షోలో ఒక పాప ఫోటో చూపించిన ఆలీ ఈ అమ్మాయి ఎవరు అనగా .. మా అమ్మాయినే అని మొదట షాక్ ఇచ్చిన శివాజీ తర్వాత క్లారిటీ ఇచ్చాడు.. అది మా చిన్నోడు రిక్కీ గాడు. ఆడపిల్ల గెటప్ వేశాం. మా ఇంట్లో ఆడపిల్ల లేదు కదా..మాకు ఆడపిల్ల లేని లోటును తీర్చుకోవాలని వాడికి ఆలా రెడీ చేసి ఫోటోలు తీసాము.. నాకు ఇద్దరు కొడుకులే కూతుర్లు లేరు. అలాగే నేను ఎక్కడా విత్తనాలు కూడా వెయ్యలేదని చెప్పాడు.. ఇక శివాజీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు..