Danush 51 : ధనుష్-శేఖర్ కమ్ముల మూవీ ఫస్ట్ లుక్ & టైటిల్ రిలీజ్.. ఎప్పుడంటే ?


డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో స్టార్ హీరోస్ ధనుష్, అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. #DNS అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ బ్యానర్ పై సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన కథానాయికగా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం నుండి అప్డేట్ ను అందించారు మేకర్స్.

Aay First Look : ఎన్నో తీపి జ్ఞాపకాలు గుర్తొచ్చేలా ‘ఆయ్’ ఫస్ట్ లుక్ పోస్టర్..

మహా శివరాత్రి సందర్భంగా రేపు(మార్చి 8న) సాయంత్రం నాలుగు గంటల అయిదు నిమిషాలకు ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను రివీల్ చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించింది చిత్రయూనిట్. ఇక ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చే సినిమాలన్నీ కూడా మనసుకి హాయిగా అనిపించేలా, చాలా పీస్ ఫుల్ గా ఉంటాయి. మరి ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోలతో ఈ సినిమాను ఎలా తెరకెక్కిస్తారో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.