మరికొన్ని రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రోజు బీజేపీ 195 సీట్లతో ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. వారణాసి నుంచి వరుసగా మూడోసారి ప్రధాని మోడీ పోటీ. తొలి జాబితాలో 28 మంది మహిళలు, యువతకు 47 స్థానాలు, ఎస్సీలకు 27, ఎస్టీలకు 18 స్థానాలు కేటాయించినట్లు వినోద్ తావ్‌డే తెలిపారు. తొలి జాబితాలో 57 మంది ఓబీసీలు బరిలో ఉండగా.. 34 మంది మంత్రులు పోటీ చేస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణ లో విడుదల చేసిన అభ్యర్థులు :
సికింద్రాబాద్ – జి.కిషన్‌రెడ్డి
కరీంనగర్ – బండి సంజయ్
నిజామాబాద్ – ధర్మపురి అర్వింద్
భువనగిరి – బూర నర్సయ్య గౌడ్
చేవెళ్ల – కొండా విశ్వేశ్వర్ రెడ్డి
నాగర్‌కర్నూల్ – పోతుగంటి భరత్
జహీరాబాద్- బీబీ పాటిల్
మల్కాజ్‌గిరి- ఈటల రాజేందర్
హైదరాబాద్- డాక్టర్ మాధవీ లత
ఇక రాష్ట్రాల వారీగా చూసినట్లయితే, అండమాన్ నికోబార్-1, అరుణాచల్ ప్రదేశ్-2, అస్సాం -11, ఛత్తీస్‌గడ్-11, దమన్ అండ్ దీవ్ -1, దిల్లీ-5, గోవా-1, గుజరాత్- 15, జమ్మూకశ్మీర్-2, ఝార్ఖండ్-11, కేరళ-12, మధ్యప్రదేశ్- 24, రాజస్థాన్ -15, తెలంగాణ-9, త్రిపుర-1, ఉత్తరాఖండ్-3, ఉత్తరప్రదేశ్ -51, పశ్చిమబెంగాల్ – 20 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసారు.
BJP releases first list of 195 candidates for Lok Sabha elections pic.twitter.com/ms1zTtzLfL
— ANI (@ANI) March 2, 2024