Bhoothaddam Bhaskar Narayana : ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ కు బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు : చిత్ర యూనిట్


శివ కందుకూరి హీరోగా నటించిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించారు. డిఫరెంట్ కంటెంట్, కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి థ్రిల్లింగ్-ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది.

సక్సెస్ మీట్ లో హీరో శివ కందుకూరి మాట్లాడుతూ.. సినిమా మొదలుపెట్టినప్పుడు సినిమా బావోస్తే చాలు అనుకున్నాం. తర్వాత ప్రమోషనల్ మెటిరియల్ ప్రేక్షకులకు రీచ్ అయితే చాలు అనుకున్నాం. అన్నిటికిమించి ఒక మంచి హిట్ కొడితే బావున్ను అనే కోరిక లోపల వుండేది. మా టీం అందరి కోరిక బలంగా వుంది. మేము అనుకున్న హిట్ ఈ సినిమాతో అందుకోవడం చాలా ఆనందంగా వుంది. మాకు ఇంత మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని ఇచ్చిన ఆడియన్స్ అందరికీ చాలా థాంక్స్. సినిమాకి అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి. మా కంటెంట్ ని ప్రశంసిస్తూ ఇంత మంచి రివ్యూస్ ఇచ్చిన మీడియా అందరికీ ధన్యవాదాలు. సినిమా చూసిన ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రేక్షకులకు ఇవ్వాల్సిన విజువల్ ఎక్స్ పీరియన్స్ ఈ సినిమాతో ఇవ్వడం చాలా ఆనందంగా వుంది. నిర్మాతలు చాలా సపోర్ట్ చేశారు. స్నేహాల్, శశిధర్, కార్తీక్ కి థాంక్స్. తొలి సినిమాతో విజయాన్ని అందుకున్న పురుషోత్తం రాజ్ కి అభినందనలు. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన తనకి చాలా థాంక్స్. ఈ సినిమాతో చాలా మంచి జర్నీ వుంది. శ్రీచరణ్ అద్భుతమైన బీజీఎం ఇచ్చారు. సినిమా చుసిన ప్రతి ఒక్కరూ మ్యూజిక్ బావుందని చెబుతున్నారు. విజయ్ రెండు బ్యుటీఫుల్ సాంగ్స్ ఇచ్చారు. షఫీ, అరుణ్, దేవి ప్రసాద్ అందరూ అద్భుతంగా నటించారు. రాశి చాలా హార్డ్ వర్క్ చేసి సినిమా చేసింది. సినిమాలో పని చేసిన అందరికీ థాంక్స్. తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ సినిమాని ఎప్పుడూ ప్రోత్సహిస్తారని మరోసారి రుజువైయింది. సినిమా చాలా చోట్ల హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇది తెలుగు ఆడియన్స్ వలనే సాధ్యపడింది. ప్రిమియర్స్ షోస్ అన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. ప్రతి షోకి ఫుల్ ఫాల్ పెరుగుతోంది. ఇంకా సినిమా చూడకపోయివుంటే తప్పకుండా వచ్చి థియేటర్స్ లో చూడండి. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. గొప్పగా అలరిస్తుంది” అన్నారు.

రివ్యూ: భూతద్ధం భాస్కర్ నారాయణ.. మస్ట్ వాచ్ థ్రిల్లర్

హీరోయిన్ రాశీ సింగ్ మాట్లాడుతూ.. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మేము ఊహించిన దానికంటే అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి ఆనందంగా వుంది. హౌస్ ఫుల్ థియేటర్స్ చూస్తుంటే చాలా సంతోషాన్ని ఇచ్చింది. నిర్మాతలు చాలా ప్యాషన్ తో ఈ సినిమా చేశారు. ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడికి ధన్యవాదాలు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. రాజ్ గారు ఈ సినిమాకి బ్యాక్ బోన్ ఆయన సపోర్ట్ కి ధన్యవాదాలు. శివ చాలా కొత్త క్యారెక్టర్ చేశారు. ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పంధన వస్తోంది. మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

దర్శకుడు పురుషోత్తం రాజ్ మాట్లాడుతూ.. సినిమాకి అద్భుతమైన స్పందన వస్తోంది. మంచి రివ్యూలు వచ్చాయి. ఇది థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా. అందరూ థియేటర్స్ లో చూడాలి. నిర్మాతలకు, నటీనటులకు ధన్యవాదలు. శివ ఈ సినిమాని బలంగా నమ్మారు. సినిమా హౌస్ ఫుల్ షోస్ తో రన్ అవుతోంది. సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కథలు చేయగలననే నమ్మకం వచ్చింది. మీ సపోర్ట్ ఇలానే వుండాలి అని కోరారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ప్రిమియర్స్ షోస్ అన్నిటికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన తర్వాత మేము ఊహించిన దానికంటే గొప్ప రెస్పాన్స్ వస్తోంది. ప్రతి షోకి ఫుల్ ఫాల్ పెరుగుతోంది. ఇంతమంచి కమర్షియల్ హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. సినిమాతో శివ కొరుకునే గుర్తింపు వచ్చింది. ఈ పాత్ర కోసం తనని తాను మలచుకున్నాడు. ఆ పాత్రకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. సినిమాకి పని చేసిన అందరూ ది బెస్ట్ ఇచ్చారు. ఇంకా సినిమా చుడాని ప్రేక్షకులు తప్పకుడా చూడండి. సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుంది అన్నారు.

నిర్మాతలు స్నేహాల్, శశిధర్ మాట్లాడుతూ.. సినిమాకి చాలా అద్భుతమైన స్పందన వస్తోంది. ఫుల్ ఫాల్ ప్రతి షోకి పెరుగుతుంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ అవుతున్నాయి. సినిమా కంటెంట్ ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. శివ నటనకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. టీం అందరికీ ధన్యవాదాలు. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ తెలిపారు. సినిమా యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.