Eagle : ఓటీటీలోకి రవితేజ ‘ఈగల్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?


మాస్ మహారాజా రవితేజ హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన చిత్రం ‘ఈగల్’. ఫిబ్రవరి 9న రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతున్న ఈ చిత్రం యొక్క స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్ సొంతం చేసుకున్నట్లు పోస్టర్ ద్వారా అఫీషియల్ గా అనౌన్స్‌ చేసారు. అయితే ఎప్పటినుండి స్ట్రీమింగ్ అవుతుందనేది మాత్రం త్వరలోనే ప్రకటించే అవకాశం వుంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటించగా.. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, ప్రణీత పట్నాయక్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. దావ్ జంద్ సంగీతాన్ని అందించారు.