టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తండ్రయ్యారు. నిఖిల్ భార్య పల్లవి వర్మ ఈరోజు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా వున్నారు. తన కుమారుడిని ముద్దాడుతున్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసిన నిఖిల్.. “నా జీవితం పూర్తి వృత్తం అయింది.. ఒక సంవత్సరం క్రితం నేను మా నాన్నను కోల్పోయాను మరియు ఈ రోజు మేము మా కుటుంబంలోకి కొత్త సభ్యుడిని స్వాగతిస్తున్నాము.. ఆయన మళ్లీ వచ్చినట్లు అనిపిస్తుంది. ఈరోజు పల్లవి & నాకు ఒక అందమైన బాబు పుట్టాడని పంచుకోవడం ఆనందంగా ఉంది” అన్నారు. దీంతో అభిమానులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇకపోతే ప్రస్తుతం పాన్ఇండియా మూవీ ‘స్వయంభూ’ లో నిఖిల్ నటిస్తున్నారు. దీంతో పాటు ‘ది ఇండియా హౌస్’, ‘కార్తికేయ 3’ చిత్రాలు కూడా పైప్లైన్లో ఉన్నాయి.
Teary eyed and Emotional.. Life comes a full circle..
Just over a year ago I lost my father and today We Welcome a New Member into our family… Feels like it's him back again.
Happy to share that Pallavi & Me Have a Cute little baby boy Delivered today 😇🥳 pic.twitter.com/B5yY5TCBNp— Nikhil Siddhartha (@actor_Nikhil) February 21, 2024