Bhoothaddham Bhaskar Narayana : ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ ట్రైలర్.. మనిషా రాక్షసుడా ?


శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో టీజర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది. అలాగే న్యూ ఏజ్ స్టార్ కంపోజర్ శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రం టైటిల్ సాంగ్ వైరల్ అయ్యింది. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ క్రమంలో, ఈ రోజు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ చిత్రం ట్రైలర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.

“ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు సమీపంలో మునుపెన్నడూ చూడని దారుణ హత్య జరిగింది. ఈ హత్యలని దిష్టి బొమ్మ హత్యలుగా పోలీసులు పేర్కొన్నారు” అనే న్యూస్ బులిటెన్ వాయిస్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఒక్క క్లూ కూడా వదలకుండా హత్యలు చేసే ఓ సీరియల్ కిల్లర్ కేసుని డిటెక్టివ్ భూతద్ధం భాస్కర్ నారాయణ(శివ కందుకూరి) ఎలా పరిష్కరించాడనేది చాలా థ్రిల్లింగ్ గా ట్రైలర్ లో ప్రజెంట్ చేశారు. అసలు సీరియల్ కిల్లర్ మనిషా రాక్షసుడా ? అని సస్పెన్స్ ని రేకెత్తిస్తూ ట్రైలర్ చివర్లో వచ్చిన సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ చాలా ఎక్సయిటింగా వున్నాయి. డిటెక్టివ్ భూతద్ధం భాస్కర్ నారాయణ గా శివ కందుకూరి పెర్ఫార్మెన్స్ చాలా ప్రామెసింగా వుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బ్రిలియంట్ గా వుంది. విజివల్స్, ప్రొడక్షన్ వాల్యుస్ టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తానికి ట్రైలర్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది.