Manchu Manoj : ‘ఇంద్ర’ తో నాకు, ‘హనుమాన్’ తో మా అబ్బాయికి.. 28 ఏళ్లకే రెండు జనరేషన్స్..


యంగ్ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హను-మాన్’ మూవీపై ప్రశంశల వర్షం కురుస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. హనుమన్ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకులే కాదు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఈ చిత్రంపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా హీరో మంచు మనోజ్ ఈ సినిమా చూసి తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

‘ఇంద్ర’ సినిమాతో నాకు, ‘హనుమాన్’ తో మా అబ్బాయి ధైరవ్ కి గూజ్ బంప్స్ తెప్పించావు కదా తమ్ముడు తేజ.. కిల్లర్ పర్ఫామెన్స్తో, అదిరిపోయే నీ యాక్టింగ్తో ఇరగ్గొట్టేశావు.. 28 ఏళ్ళకే రెండు జనరేషన్స్ని కవర్ చేసావ్.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నుంచి ఒక అమేజింగ్ ఫిలిం వచ్చేసింది.. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది తమ్ముడు ప్రశాంత్ వర్మ.. ఇంత మంచి సినిమాలో భాగమైన క్రూ మొత్తానికి కంగ్రాట్స్ అంటూ.. మనోజ్ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం మంచు మనోజ్ వరుణ్ దర్శకత్వంలో ‘వాట్ ది ఫిష్’ మూవీలో నటిస్తున్నారు.