ప్రస్తుతం యంగ్ హీరోలు సిల్వర్ స్క్రీన్ మీద వండర్లు క్రియేట్ చేస్తున్నారు. న్యూ ఏజ్ కంటెంట్‌తో వచ్చి హిట్లు కొడుతున్నారు. అలా టాలీవుడ్ యంగ్ హీరోల్లో లక్ష్ చదలవాడ ప్రస్తుతం ఫుల్ స్పీడు మీదున్నారు. వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల్లో లక్ష్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు ‘ధీర’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఆల్రెడీ ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది.
‘ధీర’ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా విడుదల కానుంది.