Lal Salaam : రవితేజ ‘ఈగల్’ రోజే రజినీ ‘లాల్ సలామ్’..


ఇటీవలే జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రస్తుతం తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో వస్తున్న ‘లాల్ సలామ్’ సినిమాలో మొయిద్దీన్ భాయ్ అనే ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఆయన లుక్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు మేకర్స్.

మొదటగా ‘లాల్ సలామ్’ మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ.. పలు కారణాల వల్ల వాయిదా పడింది. కాగా ఇప్పుడు ఈ మూవీ ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుందని అధికారకంగా ప్రకటించారు మేకర్స్. అయితే అదేరోజు రవితేజ ‘ఈగల్’ తో పాటు, సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’ కూడా రానున్నాయి.