Tillu Square : టిల్లుగాడు ఉన్నన్నాళ్ళు రాధిక ఉంటది.. అంతేగా !


స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’తో మంచి గుర్తింపు తెచ్చుకొని సక్సెస్ ఫుల్ స్టార్‌గా మారారు. ఈ చిత్రం ఆయనకు, ఆయన పోషించిన పాత్రకు ఎందరో అభిమానులను సంపాదించి పెట్టింది. ఇప్పుడు ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్‌ గా రూపొందుతోన్న ‘టిల్లు స్క్వేర్’ తో అలరించడానికి సిద్ధమవుతున్నారు సిద్ధు. మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈచిత్రం నుండి విడుదలైన పోస్టర్స్, సాంగ్ అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి రెండో సాంగ్ ని రిలీజ్ చేసారు మేకర్స్.

‘డీజే టిల్లు’ తో రాధిక పేరు ఒక బ్రాండ్ లా మారిపోయింది. అయితే ఇప్పుడు ‘రాధిక’ పేరుతో వచ్చిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుంది. ఒకసారి వినగానే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే అంతగా ఈ పాట బాగుంది. ఈ పాట ఖచ్చితంగా ఈ సంవత్సరంలోని టాప్ 10 చార్ట్‌బస్టర్‌లలో ఒకటిగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక సిద్దు, అనుపమ ఇద్దరూ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టారు. అంతేకాదు టిల్లుగాడు వున్నన్ని రోజులు రాధిక ఉంటది.. ఒక లైలా-మజ్ను, ఒక రోమియో-జూలియట్, ఒక టిల్లు-రాధిక.. దాంట్లో ఇద్దరు చచ్చిపోతారు ఈడ నేనొక్కడినే సంకనాకిపోతా.. చెప్పు రాధిక ఏం కావాలి నీకు.. అంటూ సాంగ్ మొదలవ్వడానికి ముందే సిద్దు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఈ గీతానికి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, ‘రామ్ మిరియాల తన విలక్షణ శైలిలో పాటను స్వరపరచడమే కాకుండా తానే స్వయంగా ఆలపించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ‘టిల్లు స్క్వేర్’ సినిమా 2024, ఫిబ్రవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.