Devil : ఆకట్టుకుంటున్న ‘డెవిల్’ నుంచి రాజకుమారి పాడిన ‘దిస్ ఈజ్ లేడీ రోజీ..’ సాంగ్‌


విధ్య‌మైన సినిమాల‌ను చేస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. టైటిల్, ట్యాగ్ లైన్ చూస్తుంటే సినిమాలో కళ్యాణ్ రామ్ పాత్ర ఎలా ఉంటుందనే క్యూరియాసిటీ అందరిలోనూ పెరుగుతుంది. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్‌, ‘మాయ చేశావే..’ సాంగ్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో మేకర్స్ ఈ సినిమా నుంచి మరో పాటను రిలీజ్ చేసారు.

‘దిస్ ఈజ్ లేడీ రోజీ..’ అనే లిరికల్ వీడియోను సెకండ్ సాంగ్‌గా రిలీజ్ చేశారు చిత్రబృందం. ఈ పాటను ‘జవాన్’ చిత్రంలో టైటిల్ ట్రాక్‌తో ఆకట్టుకున్న లేటెస్ట్ సింగింగ్ సెన్సేషన్ రాజకుమారి పాడటం విశేషం. ఆమె ఎనర్జిటిక్ వాయిస్ పాటకు మరింత ఎట్రాక్షన్‌గా మారింది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత సారథ్యం వహించిన డెవిల్ సినిమాలో ‘దిస్ ఈజ్ లేడీ రోజ్..’ పాటకు శ్రీహర్ష ఇమాని సాహిత్యాన్ని అందించగా రాజకుమారి ఆలపించారు. బాలీవుడ్ బ్యూటీ ఎల్నాజ్ నొరౌజీ ఈ పాటలో అప్పియరెన్స్, డాన్స్ మూమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటలో నందమూరి కళ్యాణ్ రామ్ తెలుపు రంగు సూట్ డ్రెస్‌లో ఆకట్టుకుంటున్నారు. ఇకపోతే ఎన్నో మంచి చిత్రాలను అందించిన అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను రూపొందిస్తోంది. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లే, క‌థ‌ను అందించారు.