పెట్రోల్ ధరలపై కేంద్ర పెట్రోలియం మంత్రి కీలక వ్యాఖ్యలు


భారత్‌లో ఇతర దేశాలతో పోలిస్తే ఈ రెండేళ్లలో పెట్రోల్ ధరలు అంతగా ఏమీ పెరగలేదని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. జూన్ 2021 నుంచి జూన్ 2023 మధ్య భారతదేశంలో పెట్రోల్ ధరలు 2.36 శాతం మాత్రమే పెరిగాయని ఆయన తెలిపారు. అయితే ఈ రెండేళ్లలో పాకిస్తాన్‌లో 50.83 శాతం పెట్రోల్ ధరలు పెరిగాయని పెరిగిందని కేంద్ర మంత్రి చెప్పారు. ఆ రెండేళ్లలోనే శ్రీలంకలో 79.61శాతం, నేపాల్‌లో 42.39 శాతం, అమెరికాలో 30.15శాతం పెరిగాయన్నారు. కెనడాలో రెండేళ్లలో 24.17శాతం ధరలు పెరిగాయన్నారు. డీజిల్ ధరలు భారత్‌లో 4.97 శాతం పెరగగా.. పాకిస్థాన్‌లో 40.81 శాతం పెరిగాయని ఆయన తెలిపారు.