‘ఖుషి’ ట్రైలర్ వచ్చేస్తోంది.. పోస్టరే ఇలా ఉంటే ఇక ట్రైలర్ ?


విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఖుషి’. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ మూవీని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఖుషి సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి, పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.

ఈ సినిమా ట్రైలర్ ను ఆగస్ట్ 9వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఒక కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేసారు మేకర్స్. ఈ పోస్టర్ లో విజయ్, సమంత చాలా రొమాంటిక్ గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట్లో సందడి చేస్తుంది. హిషామ్ అబ్దుల్ వాహబ్ అందించిన పాటలు ఒకదానిని మించి మరొకటి చాలా అద్భుతంగా వున్నాయి. ఇక ఖుషి ట్రైలర్ పై కూడా భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక సెప్టెంబర్ 1న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు.