ఈ వారం విడుదలయ్యే సినిమాల లిస్ట్ ఇదే..


ఓటీటీలు వ‌చ్చాక సినీ ప్రియుల‌కి కావ‌ల్సిన వినోదం అందుతుంది. థియేట‌ర్స్ లో సినిమాలు నిరాశ‌ప‌ర‌చిన కూడా ఓటీటీలో మాత్రం మంచి కంటెంట్ ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో ప్రేక్ష‌కుల‌కి మంచి మ‌జా ద‌క్కుతుంది. ఇక గత రెండు వారాలుగా థియేటర్లలో చిన్న సినిమాలే విడుదల అవుతూ వచ్చాయి.

కానీ ఈ వారం మాత్రం పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమా జూలై 28 న విడుదల కానుంది. దీంతో అంద‌రు థియేట‌ర్స్‌కి ప‌రుగులు పెడుతున్నారు. బ్రో సినిమాతో పాటు థియేట‌ర్‌లో ఈ వారం రిలీజ్ కానున్న మ‌రో చిత్రం ‘స్లమ్ డాగ్ హస్బెండ్’. సంజయ్ రావు హీరోగా ప్రణవి మానుకొండ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం జులై 29 న విడుదల కానుంది. ఇక బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, అలియా భట్ కలిసి నటించిన మూవీ ‘రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’ అనే బాలీవుడ్ చిత్రం జూలై 28 న విడుదల కానుంది.

ఇక ఓటీటీలో కూడా పలు సినిమాలు స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉన్నాయి. మరి జూలై చివ‌రి వారంలో ఓటీటీల్లోకి రాబోతున్న సినిమాల లిస్ట్ ఒక సారి చూద్దాం.

నెట్ ఫ్లిక్స్ లో.. డ్రీమ్(కొరియన్ మూవీ) – జులై 25 , మామన్నన్ – జులై 27 (తెలుగు/తమిళ్) , పారడైజ్(హాలీవుడ్) – జులై 27, హిడెన్ స్ట్రైక్(హాలీవుడ్) – జులై 27, హ్యాపీనెస్ ఫర్ బిగినెర్స్(హాలీవుడ్) – జులై 27, హౌ టు బికమ్ ఎ కల్ట్ లీడర్ – జులై 28న స్ట్రీమింగ్ కానున్నాయి.

అమెజాన్ ప్రైమ్ లో.. నిఖిత్‌ నటించిన స్పై, రెజీనా(తెలుగు డబ్బింగ్) – జులై 25న స్ట్రీమింగ్ కానుండ‌గా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో.. ఆషిఖానా (హిందీ సిరీస్) – జులై 24, సోనీ లీవ్ లో.. ట్విస్టెడ్ మెటల్(వెబ్ సిరీస్) – జులై 28న‌,

బుక్ మై షోలో.. జస్టిస్ లీగ్: వార్ వరల్డ్(యానిమేషన్ మూవీ) – జులై 23న , ట్రాన్స్ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్(హాలీవుడ్) – జులై 28న‌, ద ఫ్లాష్(హాలీవుడ్) – జులై 27న స్ట్రీమింగ్ కానుంది.