గత ఏడాది నుంచి తిరిగి ఫాంలోకి వచ్చిన విరాట్ కోహ్లీ పరుగులు సాధించడంలో తనకు తిరుగులేదని నిరూపిస్తున్నాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ టోర్నీలో పరుగుల వరద పారించారు. ఆ తర్వాత కూడా భారత జట్టు తరపున ఆడిన అనేక మ్యాచుల్లో సత్తా చాటుతూనే ఉన్నాడు. తాజాగా విండీస్ జట్టుతో క్వీన్స్ పార్క్ ఓవెల్ లో జరుగుతున్న రెండో టెస్టులో ఆడుతున్న కోహ్లీ సెంచరీ సాధించారు.
ఇకపోతే తొలి రోజు ఆటలో వేగంగా క్రీజులోకి చేరే క్రమంలో డైవ్ చేస్తూ తన వికెట్ కాపాడుకున్నాడు. పరుగు పూర్తి చేశారు. ఈ ఘటనపై విండీస్ దిగ్గజం ఇయాన్ బిషప్ ప్రశంసలు కురిపించారు. 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నప్పటికీ కోహ్లీ ప్రతి పరుగును ఎంతో విలువైనదిగా భావిస్తాడని, అదే తన అంకితభావానికి నిదర్శనమని ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు వెస్టిండీస్ యువ ఆటాగాళ్లు కోహ్లీ నుంచి స్పూర్తి పొందాలని సూచించాడు.