నీతి ఆయోగ్ నివేదిక ‘నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్: ఎ ప్రోగ్రెస్ రివ్యూ 2023’ ప్రకారం 2015-16 మరియు 2019-21 మధ్య రికార్డు స్థాయిలో 13.5 కోట్ల మంది ప్రజలు బహుమితీయ పేదరికం నుండి బయటపడ్డారు. నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వి కె పాల్ మరియు డాక్టర్ అరవింద్ వీరమణి మరియు నీతి ఆయోగ్ సిఇఒ శ్రీ బి వి ఆర్ సుబ్రహ్మణ్యం సమక్షంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ శ్రీ సుమన్ బేరీ ఈ రోజు నివేదికను విడుదల చేశారు.
తాజా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే [NFHS-5 (2019-21)] ఆధారంగా, జాతీయ బహుమితీయ పేదరిక సూచిక (MPI) యొక్క ఈ రెండవ ఎడిషన్ రెండు సర్వేలు, ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ 4 (2015-16) మరియు ఎన్ ఎఫ్ హెచ్ ఎస్-5 (2019-21)మధ్య బహుమితీయ పేదరికాన్ని తగ్గించడంలో భారతదేశం యొక్క పురోగతిని సూచిస్తుంది. ఇది నవంబర్ 2021బేస్లైన్ పై ప్రారంభించబడిన భారతదేశపు జాతీయ ఎం పీ ఐ నివేదిక. ప్రపంచ వ్యాప్తంగాఅనుసరించిన విస్తృత పద్దతి కి అనుగుణంగా ఈ నివేదిక రూపొందించబడింది. నివేదికను www.niti.gov.inలో చదవవచ్చు.